Published : 10 Jul 2022 00:26 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఎందుకో తెలుసా?

చింటు: వర్షం వచ్చేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా బంటీ!
బంటి: ఆ.. ఏముంది. భూమి పూర్తిగా తడిసిందో, లేదో తెలుసుకోవడానికి, వానదేవుడు టార్చ్‌లైట్‌ను వేసి చూస్తాడు. ఆ వెలుతురే మెరుపులు!
చింటు: ఆఁ!!

నిజమే సుమా!

టీచర్‌: రోజూ బాదం తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా కిట్టూ?
కిట్టు: ఓ.. తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. కిట్టూ.. అదేంటో చెప్పు..
కిట్టు: బాదం డబ్బా ఖాళీ అవుతుంది.

ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా!

టీచర్‌: టింకూ... టింకూ.. నిన్నే.. నేను ఇంత కష్టపడి పాఠం చెబుతుంటే.. నువ్వు ఎంచక్కా నిద్రపోతున్నావు ఏంటి?
టింకు:  ఈ స్వతంత్ర భారతదేశంలో నాకు కాసేపు నిద్రపోయే స్వేచ్ఛ కూడా లేదా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని