నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : పిల్లలూ.. మీ ఇంట్లో ఎక్కువగా భయపడేది ఎవరు?

Updated : 11 Jul 2022 06:49 IST

అలా అర్థమైందా?

టీచర్‌ : పిల్లలూ.. మీ ఇంట్లో ఎక్కువగా భయపడేది ఎవరు?
టింకు : మా అమ్మ టీచర్‌..

టీచర్‌ : ఎందుకు భయం?
టింకు : ఎప్పుడు రోడ్డు దాటాలన్నా.. నా చెయ్యే గట్టిగా పట్టుకుంటుంది టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అబ్బ.. భలే పాటించాడు..

టీచర్‌ : ఏంటి రవీ.. స్కూల్‌కి ఇంత ఆలస్యంగానా వచ్చేది?
రవి : నా తప్పేం లేదు టీచర్‌.. అక్కడున్న బోర్డునే నేను ఫాలో అయ్యాను..
టీచర్‌ : ఏం బోర్డు?
రవి : ‘దగ్గరలో స్కూలు ఉంది.. నెమ్మదిగా వెళ్లండి’ అని రాసి ఉంది టీచర్‌..

ఇక తగ్గినట్లే!

అమ్మ : రమ్యా.. తాతయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లావు కదా.. డాక్టర్‌ ఏం చెప్పారు?
రమ్య : ముందు బరువు తగ్గాలని చెప్పారమ్మా..

అమ్మ : ఇంకేమన్నారు?
రమ్య : రాత్రిళ్లు ఓట్స్‌ తినమన్నారు.. కానీ, భోజనానికి ముందో తరవాతో అడగటం మర్చిపోయానమ్మా..

అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని