నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి చింటూ.. వానకు సెల్యూట్‌ చేస్తున్నావు.. వర్షాలు బాగా పడి, పంటలు ఎక్కువగా పండాలనా?....

Published : 12 Jul 2022 00:19 IST

అందుకే మరి!

నాన్న:  ఏంటి చింటూ.. వానకు సెల్యూట్‌ చేస్తున్నావు.. వర్షాలు బాగా పడి, పంటలు ఎక్కువగా పండాలనా?
చింటు: కాదు నాన్నా... స్కూల్‌కు వాన వల్లే కదా సెలవులు వచ్చింది.. అందుకని!
నాన్న: ఆఁ!!

దటీజ్‌ కిట్టూ!

టీచర్‌: ఈ సమాజంలో సమన్యాయం ఉందా కిట్టూ?
కిట్టు: సమాజం వరకు ఎందుకు టీచర్‌.. మన క్లాస్‌లోనే సమన్యాయం లేదు..  
టీచర్‌: ఏ.. ఎందుకలా అంటున్నావు?
కిట్టు: పరీక్షలో నాకేమో నలభై మార్కులు వేశారు. చరణ్‌కు యాభై, వరుణ్‌కు అరవై.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా మార్కులు వేశారు. మీరే చెప్పండి టీచర్‌.. సమన్యాయం ఎక్కడ ఉన్నట్లో!!
టీచర్‌: ఆఁ!!

అందుకే తాతయ్యా!

తాతయ్య: బిట్టూ.. నువ్వు ఎందుకు ఈరోజు స్కూల్‌కు వెళ్లలేదు?
బిట్టు: బయోలజీ టీచర్‌ సెల్‌ అంటే కణం అంటారు. ఫిజిక్స్‌ టీచర్‌.. బ్యాటరీ అంటారు. ఇంగ్లిష్‌ టీచరేమో ఫోన్‌ అంటారు. హిస్టరీ సారేమో జైలు గది అంటారు... అందుకే నాకు స్కూలంటేనే విసుగొచ్చింది తాతయ్యా!
తాతయ్య: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని