Published : 14 Jul 2022 00:52 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతేగా.. అంతేగా...!

టీచర్‌: అరటి పండు గురించి నీకు తెలిసింది చెప్పు బిట్టూ!
బిట్టు: తింటే బలపడతాం.. తొక్కితే జారిపడతాం టీచర్‌..

టీచర్‌: ఆఁ!!

తెలుసుకుందామని!

నాన్న: ఏంటి కిట్టూ.. ఎన్నడూ లేనిది, ఈ రోజు అంత సీరియస్‌గా టీవీలో వార్తలు చూస్తున్నావు?
కిట్టు: వర్షాల వల్ల మాకిచ్చిన సెలవులను సోమవారం వరకు పొడిగించారట.. మళ్లీ పెంచే అవకాశాల గురించి ఏమైనా చెబుతారేమోనని చూస్తున్నా నాన్నా!

నాన్న: ఆఁ!!

నాకలా అర్థమైంది!

టీచర్‌: ‘న్యూటన్‌ యాపిల్‌ చెట్టు కింద కూర్చున్నప్పుడు పండు కింద పడటం చూశాడు.. అప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకున్నాడు’.. ఈ సంఘటన ద్వారా నీకు ఏం అర్థమైంది టింకూ?
టింకు: ఆ సమయంలో న్యూటన్‌కు ఆకలి వేయలేదని అర్థమైంది టీచర్‌..

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు