నవ్వుల్‌.. నవ్వుల్‌.!

కిట్టు: అమ్మా.. నువ్వు నాటిన గులాబీ మొక్కకు అస్సలు వేర్లు పెరగడం లేదు!

Published : 15 Jul 2022 00:58 IST

రోజూ చూస్తూనే ఉన్నా...

కిట్టు: అమ్మా.. నువ్వు నాటిన గులాబీ మొక్కకు అస్సలు వేర్లు పెరగడం లేదు!
అమ్మ: అవునా.. నీకెలా తెలుసు కిట్టూ?

కిట్టు: రోజూ మొక్కను పీకి చూస్తున్నా..
అమ్మ: ఆఁ!!

చేపది ఎంత అదృష్టమో!

నాన్న: ఏంటి టింకూ.. అక్వేరియంలోని చేపను అలాగే చూస్తున్నావు?
టింకు: చేపకున్న ఓ శక్తి నాకు వస్తే ఎంత బాగుంటుందో అని!

నాన్న: ఏ శక్తి?
టింకు: కళ్లు తెరిచి నిద్రపోయే శక్తి.. అప్పుడు ఎంచక్కా క్లాసులో టీచర్‌ పాఠం చెబుతున్నా, నేను హాయిగా నిద్రపోవచ్చుగా..!

నాన్న: ఆఁ!!

అది ఎవరో.. ఏంటో!

బంటి: టీచర్‌.. నా పుస్తకాల మీద ఎవరో మత్తు మందు చల్లారు. వాళ్లెవరో తెలియడం లేదు?
టీచర్‌: మత్తు మందు చల్లడం ఏంటి బంటీ?

బంటి: అవును టీచర్‌... నేను ఎప్పుడు పుస్తకం తెరిస్తే అప్పుడు నాకు నిద్ర ముంచుకొస్తోంది మరి!
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని