Published : 17 Jul 2022 00:20 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంజూ రాక్స్‌..

టీచర్‌ : అంజూ.. ‘హింస’కు వ్యతిరేక పదమేంటో చెప్పు?
అంజు : అహింస టీచర్‌..

టీచర్‌ : వెరీ గుడ్‌.. మరి ‘మేలు’కు ఏంటి?  
అంజు : ‘ఫిమేలు’ టీచర్‌..

అంతేగా.. అంతేగా...!

టీచర్‌ : సూరజ్‌! మతిమరుపునకు, జ్ఞాపకశక్తికీ తేడా ఏంటో చెప్పు?
సూరజ్‌: మనకు ఇవ్వాల్సినవి గుర్తు పెట్టుకోవడం జ్ఞాపకశక్తి, మనం ఇవ్వాల్సినవి మరిచిపోవడం మతిమరుపు
టీచర్‌ : ఆఁ!!

మట్టి కొనలేదు!

టింకు: నిన్న ఓ గులాబీ మొక్కను, అరకిలో ఎర్రమట్టి వేసి కుండీలో నాటాం తెలుసా!
బిట్టు: ఓ.. అవునా..!
టింకు: కానీ మేం ఎర్రమట్టి కొనలేదు తెలుసా?
బిట్టు: అవునా.. మరి ఎక్కడ తెచ్చారు?

టింకు:   మా నాన్న కిలో అల్లం కొన్నారు. దానిలో అరకిలో ఎర్రమట్టి వచ్చింది. దాన్నే కుండీలో వేసి మొక్కను నాటాం.
బిట్టు: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని