Published : 18 Jul 2022 00:23 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కిట్టూనా మజాకా!

టీచర్‌: చంటీ.. భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా?
చంటి: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. దాంతో భూమి కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు భూకంపం వస్తుంది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

జన్మజన్మల బంధం!

టీచర్‌: రక్త సంబంధం అంటే ఏంటి చింటూ?
చింటు : మనకూ, దోమలకూ ఉండే సంబంధాన్నే రక్త సంబంధం అంటారు టీచర్‌..

టీచర్‌: ఆ..!!

ఎందుకిలా?

టీచర్‌: పిల్లలూ! పాఠాలు చెప్పడం పూర్తైంది. ఏమైనా అనుమానాలుంటే అడగండి?
చరణ్‌: మీరిచ్చే క్వశ్చన్‌ పేపర్లో ప్రశ్నలుంటాయి. మరి ఆన్సర్‌ పేపర్లో జవాబులు ఎందుకు ఉండవు టీచర్‌?

టీచర్‌: ఆఁ!!

అదన్నమాట విషయం!

శిరీష: ఏంటి చిన్నూ... ఏదో ఆలోచిస్తున్నావ్‌?
చిన్ను: ఏం లేదు.. మళ్లీ వర్షాలు పడితే.. మళ్లీ సెలవులు ఇస్తారా.. ఇవ్వరా..? అని ఆలోచిస్తున్నా!

శిరీష: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని