నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ.. నిజమైన స్నేహితులు అని ఎవరిని అంటాం?

Published : 20 Jul 2022 00:23 IST

దోస్తు మేరా దోస్త్‌!

టీచర్‌: పిల్లలూ.. నిజమైన స్నేహితులు అని ఎవరిని అంటాం?
రవి: పరీక్షలో సమాధానాలు చూపించిన వాళ్లను టీచర్‌..
గిరి: ఓటీటీ లాగిన్‌ పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసే వాళ్లను టీచర్‌..
టీచర్‌:  ఆఁ!!

అంతే మరి!

టీచర్‌: చింటూ.. నీకు ఈ స్కూల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం?
చింటు: బెల్‌ కొట్టే రంగయ్య అంటే చాలా ఇష్టం టీచర్‌.

టీచర్‌:  ఆఁ!!

నిజమే చెప్పాగా!

నాన్న: కిట్టూ.. నీకు లెక్కల్లో వందకు పైనే వచ్చాయన్నావు.. మరి కేవలం ఆరు మార్కులే ఉన్నాయేంటి?
కిట్టు: అవును నాన్నా.. ఆ ఆరు మార్కులు ఎక్కడ వేశారో చూడు. వందకు పైనే కదా!

ఆరోగ్యానికి మంచిదని!

శివ: ఏంటి రవీ! సైకిల్‌ కింద పడేసి దాని మీద నుంచున్నావు?
రవి: సైకిల్‌ తొక్కడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్‌ అంకుల్‌ చెబితేను..

మీవల్లే డాక్టర్‌!

డాక్టర్‌: అరరే.. ఏంటి బాబూ! నీ నోరు నీలం రంగులోకి మారింది?
బిట్టు: మీ వల్లే డాక్టర్‌ అంకుల్‌!

డాక్టర్‌: నేనేం చేశాను?
బిట్టు: థర్మామీటరు బదులు మీరు నా నోట్లో ఇంకు పెన్ను పెట్టి వెళ్లారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని