నవ్వులే... నవ్వులు!

నాన్న: ఏంటి కవితా! ఏదైనా ఫోనొస్త్తే కనీసం రెండు గంటలు మాట్లాడేదానివి. ఈ రోజేంటి అరగంటకే పెట్టేశావు?

Updated : 21 Jul 2022 00:54 IST

అవునా.. నిజమా!

నాన్న: ఏంటి కవితా! ఏదైనా ఫోనొస్త్తే కనీసం రెండు గంటలు మాట్లాడేదానివి. ఈ రోజేంటి అరగంటకే పెట్టేశావు?
కవిత: అది రాంగ్‌నంబర్‌ నాన్నా!

నాన్న: ఆఁ!!

అలా చేస్తావన్నమాట!

టీచర్‌: టింకూ.. నువ్వు ఓ పడవలో ప్రయాణిస్తున్నావు అనుకో.. దానికి అనుకోకుండా చిల్లుపడితే ఏం చేస్తావు?
టింకు: ఆ.. సింపుల్‌ టీచర్‌. పడవకు ఇంకో చిల్లు పెడతా టీచర్‌. అప్పుడా చిల్లులోంచి వచ్చినవి, ఈ చిల్లులోంచి పోతాయి.

మీకే సరిగా తెలియదు!

టీచర్‌: నువ్వు మీ అన్నయ్యకు 600 రూపాయలు అప్పిచ్చావనుకో! మీ అన్న రోజుకు 20 రూపాయల చొప్పున చెల్లిస్తుంటే.. ఎన్ని రోజుల్లో అప్పు తీరిపోతుంది?
చరణ్‌: ఎప్పటికీ తీరదు టీచర్‌.

టీచర్‌: అదేంటి? నీకు లెక్కలు సరిగా రావా?
చరణ్‌: మీకే మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని