నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మమ్మ : ఏంటి కార్తీ.. ఆకాశంలోకి చూస్తూ, దేని గురించో ఆలోచిస్తున్నావు?

Published : 22 Jul 2022 00:19 IST

అందరికీ మామే!

అమ్మమ్మ : ఏంటి కార్తీ.. ఆకాశంలోకి చూస్తూ, దేని గురించో ఆలోచిస్తున్నావు?
కార్తి : ఏం లేదు అమ్మమ్మా.. చందమామ అందరికీ మామ ఎలా అయ్యాడా అని..
అమ్మమ్మ : ఆఁ..!

సైంటిస్టు రమ్య..

రమ్య : మావయ్యా మావయ్యా.. నేనో కొత్త విషయం కనిపెట్టానోచ్‌..
మావయ్య : ఏంటది?

రమ్య : సూర్యుడు రాత్రిళ్లు ఎందుకు కనిపించడో తెలిసింది..
మావయ్య : ఎందుకు?

రమ్య : సూర్యుడికి కూడా చీకటంటే భయం కాబట్టి..
మావయ్య : ఆఁ..!

లాజిక్కే కదా..

టీచర్‌ : ఏంటి కిట్టూ.. కాళ్లకు తప్ప ఒళ్లంతా బురద అంటించుకొని వచ్చావు?
కిట్టు : కాళ్లకు బురద అంటించుకుంటే.. ఇంట్లోని రానివ్వనని మా అమ్మ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది టీచర్‌..

కొత్తదంటే అంతే..

బంటి : చంటీ.. ఏంటి దేవుడికి అంతగా దండం పెడుతున్నావు?
చంటి : మరేం లేదక్కా.. వర్షం రావాలని కోరుకుంటున్నా..

బంటి : ఎందుకు?
చంటి : మొన్న నాన్న కొనిచ్చిన రెయిన్‌ కోట్‌ బయటకు తీద్దామని..
బంటి : ఆఁ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని