నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : ఏంటి హరీ.. నువ్వసలు ఇంట్లో, బయటా ఎవర్నీ లెక్కచేయడం లేదట?

Published : 23 Jul 2022 00:23 IST

లెక్క సరిపోయింది..

టీచర్‌ : ఏంటి హరీ.. నువ్వసలు ఇంట్లో, బయటా ఎవర్నీ లెక్కచేయడం లేదట?
హరి : అవును టీచర్‌..

టీచర్‌ : ఎందుకలా?
హరి : మొన్నటి పరీక్షలో నాకసలు లెక్కలే రావని.. మీరే కదా సున్నా మార్కులు వేశారు..
టీచర్‌ : ఆ..!!

జీవిత సత్యం!

టిల్లు : నాన్నా నాన్నా.. నేనిప్పుడే కరెంటు పోయినప్పుడు ఒక జీవిత సత్యం తెలుసుకున్నా..
నాన్న : ఏంటది?

టిల్లు : చీకట్లో మనం ముందు నుంచైనా, వెనక నుంచైనా ఒకేలా కనిపిస్తాం..
నాన్న : ఆ..!!

భలే పాయింట్‌!

టీచర్‌ : ఏంటి నవీనా.. నేను గొంతుచించుకొని మరీ ప్రశ్న అడుగుతుంటే, నువ్వు మౌనంగా నిల్చున్నావేంటి?
నవీన : ‘ఏ సమాధానం చెప్పకపోవడమూ ఒక సమాధానమే’ అని నిన్న హెడ్మాస్టర్‌ సర్‌ చెప్పారు టీచర్‌..

నిజమే కదా!

అమ్మ : ఏరా ఆర్యా.. వర్షంలో అలా తడుస్తున్నావు?
ఆర్య : ఇది వర్షాకాలం కదమ్మా.. అందుకే, వర్షంలో తడవడం ప్రాక్టీస్‌ చేస్తున్నా..
అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని