నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ : పింకీ.. ఈ రోజు పరీక్ష ఎలా రాశావు?

Published : 05 Feb 2023 16:13 IST

దెబ్బకు దెబ్బ!

అమ్మ : పింకీ.. ఈ రోజు పరీక్ష ఎలా రాశావు?
పింకీ : అన్నీ నాకు తెలియని ప్రశ్నలే అడిగారమ్మా..

అమ్మ : అవునా.. ఏం చేశావు మరి?
పింకీ : నేనేమైనా తక్కువా.. అన్నీ వాళ్లకు తెలియని జవాబులే రాసి వచ్చానమ్మా..  
అమ్మ : ఆఁ!!

భలే మనవడు..

తాతయ్య : ఒరేయ్‌.. ఒరేయ్‌.. అమ్మమ్మ మీద నీళ్లు అలా కుమ్మరించావేంట్రా..?
చంటి : అమ్మమ్మే నామీద కోప్పడుతూ.. ‘ఒళ్లు మండుతోంది’ అని అంటేనూ..

నేనే ఫస్ట్‌!

నాన్న : రామూ.. నువ్వు ఇప్పటివరకూ ఏ పరీక్షలోనైనా, ఆటల పోటీల్లోనైనా ఫస్ట్‌ వచ్చావా?
రాము : లేదు నాన్నా..
నాన్న : మన పక్కింటి తేజూను చూడు.. ఈసారి కూడా సింగింగ్‌లో మొదటి బహుమతి తనదేనట..
రాము : బడి నుంచి ఇంటికి పరుగు పందెం పెడితే నేనే ఫస్ట్‌ వస్తా నాన్నా..
నాన్న : ఆఁ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు