నవ్వుల్‌.. నవ్వుల్‌...!

నాన్న: పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు?

Published : 25 Jul 2022 00:20 IST

ఇద్దరూ.. ఇద్దరే!

నాన్న: పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు?
చింటు: అయిదు నాన్నా!

నాన్న: మరి.. అందులో ఎన్నింటికి సమాధానాలు రాశావు?
చింటు: మొదటి మూడు, చివరి రెండుకు తప్ప అన్నింటికీ సమాధానాలు రాశా!

నాన్న: గుడ్‌!

ఓ.. తప్పకుండా చెబుతా!

కిట్టు: టింకూ.. నీ ఫోన్‌ నంబర్‌ కాస్త చెబుతావా?
టింకు: 92888....
కిట్టు: హుమ్‌.. ఆపావే..!
టింకు: కాస్త చెప్పమని నువ్వే అన్నావుగా!

మీరే అన్నారుగా!

నాన్న: అదేంట్రా! అలా చేతుల మీద నడుస్తున్నావ్‌?
బిట్టు: పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఇంట్లో కాళ్లు పెట్టొద్దన్నారుగా!
నాన్న: ఆఁ!!

రెండంటే రెండే!

టీచర్‌: టిల్లూ...! సూర్యుడి వల్ల కలిగే రెండు ఉపయోగాలేంటో చెప్పు?
టిల్లు: ఒంటిపూట బళ్లూ.. వేసవి సెలవులు టీచర్‌!
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని