Updated : 27 Jul 2022 05:49 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతేగా... అంతేగా...!

చింటు: మా తాతను అందరూ సింహం అంటారు. మా నాన్నను పులి, నన్ను పులి బిడ్డ అంటారు.. తెలుసా
కిట్టు: అంటే మీ ఇంట్లో ఎవరూ మనుషులు లేరన్నమాట.

చింటు: ఆఁ!!

క్లారిటీ ఉండాలిగా!

టీచర్‌: ఎవరి కంట్లోనైనా కారం పడితే మనం ఏం చేయాలి?
టింకు: ఏ కంట్లో టీచర్‌.. కుడి కంట్లోనా... ఎడమ కంట్లోనా?

టీచర్‌: ఆఁ!!

దొందూ.. దొందే!

చరణ్‌: వరుణ్‌.. నాకు చిన్నప్పుడు పెద్ద యాక్సిడెంట్‌ అయింది తెలుసా!
వరుణ్‌: మరి బతికావా?

చరణ్‌: ఏమో నాకు సరిగా గుర్తులేదు. అప్పుడు నాకు రెండేళ్లే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని