నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌: మీ ఇంట్లో అబద్ధాలు ఆడని వారు ఎవరైనా ఉన్నారా?

Updated : 28 Jul 2022 07:11 IST

ఒకే ఒక్కడు!

టీచర్‌: మీ ఇంట్లో అబద్ధాలు ఆడని వారు ఎవరైనా ఉన్నారా?
చింటు: ఉన్నారు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. ఎవరు?
చింటు: మా తమ్ముడు టీచర్‌. వారం క్రితమే పుట్టాడు.

టీచర్‌: ఆఁ!!

అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో!

కిట్టు: ఏంటీ.. రాజకీయ నాయకులంతా ప్రయాణిస్తున్న పడవ వరదల్లో మునిగిపోయిందా? మరి ఎవరైనా బతికారా?
బిట్టు: ఆ.. బతికారు.

కిట్టు: ఎవరు?
బిట్టు: ఇంకెవరు జనం..

అంతేగా.. అంతేగా...!

టీచర్‌: ఇంటికి, బడికి తేడా ఏంటో చెప్పు.. టింకూ?
టింకు: ఇల్లు బస్సులాంటిది, బడి విమానం లాంటిది టీచర్‌.

టీచర్‌:  ఇదేం పోలిక?
టింకు: బస్సు నచ్చకపోతే ఎక్కడంటే అక్కడ ఆపి దిగిపోవచ్చు. కానీ విమానం నచ్చినా.. నచ్చకపోయినా... ప్రయాణం పూర్తయ్యేంత వరకు అందులోనే పడి ఉండాలి.

దటీజ్‌ బంటీ!

నాన్న: ఒరేయ్‌! బంటీ.. నువ్వు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. నా కడుపున చెడబుట్టావు కదరా?
బంటి: నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నేను నీ కడుపున కాదు, అమ్మ కడుపులో పుట్టాను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు