నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : పిల్లలూ.. పాదాభివందనం అంటే ఏంటో తెలుసా?

Published : 30 Jul 2022 00:22 IST

భలే చెప్పాడు..

టీచర్‌ : పిల్లలూ.. పాదాభివందనం అంటే ఏంటో తెలుసా?
కిరీటి : నాకు తెలుసు టీచర్‌..

టీచర్‌ : వెరీ గుడ్‌.. ఏంటో చెప్పు..
కిరీటి : పాదాలతో చేసే వందనాన్నే పాదాభివందనం అంటారు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అర్థం చేసుకోరూ!

అంకుల్‌ : ఏంటి వందనా.. మీ అమ్మమ్మ నీ మీద అంతలా కోప్పడుతోంది?
వందన : మరేం లేదు.. మజ్జిగ ఇచ్చానంతే..  
అంకుల్‌ : అందులో ఏముంది?  
వందన : చల్లటివి పళ్లకు తగిలితే లాగేస్తున్నాయంటే.. మజ్జిగను కాస్త వేడి చేసి ఇచ్చాను అంకుల్‌..

పాయింటే..

లహరి : నాన్నా నాన్నా.. నేనో విషయం కనిపెట్టానోచ్‌..
నాన్న : ఏంటది?

లహరి : చంద్రుడు మాత్రమే మన చుట్టం.. సూర్యుడు కాదు..
నాన్న : అదెలా?

లహరి : చంద్రుడిని చందమామ అని అంటాం కానీ సూర్యుడిని సూర్యుడు అనే పిలుస్తాం కదా..
నాన్న : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని