నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : ఏంటి హర్షా.. చాలా చిరాగ్గా కనిపిస్తున్నావు?

Published : 31 Jul 2022 00:19 IST

నిజంగా అన్యాయమే..

టీచర్‌ : ఏంటి హర్షా.. చాలా చిరాగ్గా కనిపిస్తున్నావు?
హర్ష : నా చెవులూ, ముక్కుకు చాలా అన్యాయం జరుగుతోంది టీచర్‌..

టీచర్‌ : ఏమైందేంటి?
హర్ష : అద్దాల అవసరమేమో కళ్లకి.. కానీ, వాటిని మోయాల్సింది మాత్రం చెవులూ, ముక్కూ..

టీచర్‌ : ఆ..!!

పెద్ద వరమే!

అమ్మ : ఏంటి టిల్లూ.. దేవుడికి అంతసేపు దండం పెట్టి, ఏం కోరుకున్నావు?
టిల్లు : వర్షంలో ఎంత తడిచినా, ఎన్ని ఐస్‌క్రీములు తిన్నా జలుబు రాకుండా చూడమని వరం అడిగానమ్మా..

కష్టం కాకూడదని..

నాన్న : రేష్మీ.. పరీక్షలో ఏ ప్రశ్నకూ సమాధానం రాయకుండానే వచ్చేశావంటా?
రేష్మి : అవును నాన్నా..

నాన్న : ఎందుకలా?
రేష్మి : తెలిసిన సమాధానాలనే.. టీచర్లు, మళ్లీ రెండోసారి నా ద్వారా తెలుసుకోవడం ఎందుకనీ..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని