Published : 02 Aug 2022 00:22 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

దటీజ్‌ బంటీ..

నాన్న: ఏంటి బంటీ.. ఎండలో నిల్చున్నావు?
బంటి: చెమట ఆరబెట్టుకుందామని నాన్నా!
నాన్న: ఆఁ!!

అట్లుంటది మరి!

టింకు: మేం బౌలింగ్‌ వేస్తే అవతలి జట్టు ఒక్క సింగిల్‌ రన్‌ కూడా తీయలేదు తెలుసా సార్‌?
ప్రిన్సిపల్‌: మరి వాళ్లెలా గెలిచారు?!
టింకు:   ఫోర్లు, సిక్సులు కొట్టి...
ప్రిన్సిపల్‌: ఆఁ!!

కారణమేంటి?

కిట్టు: అమ్మా...! పాపం మన ఎదురింటివాళ్లు పేదోళ్లా?
అమ్మ: కాదు.. ఎందుకు?
కిట్టు: మరి వాళ్ల బాబు ఒక రూపాయి కాయిన్‌ మింగితేనే కంగారు పడుతున్నారెందుకు? ఇంట్లో ఇంకేం డబ్బులు లేనట్లు..!

ఇప్పటికైనా నమ్ముతారా..!

తరుణ్‌: ఓ పిల్ల, ఏనుగు పాలు తాగి రెండు వారాల్లో ఇరవై కిలోల వరకు బరువు పెరిగింది.
చరణ్‌: నేను నమ్మను.. అది అసాధ్యం.. అయినా ఇంతకీ ఎవరా పిల్ల?
తరుణ్‌: ఏనుగు పిల్ల..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని