Published : 04 Aug 2022 00:19 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతేగా.. అంతేగా...!

నాన్న: ఏం చింటూ.. బొమ్మ గీస్తున్నావా?
చింటు: అవును నాన్నా!

నాన్న: గుడ్‌.. ఇంతకీ ఏం బొమ్మేస్తున్నావు?
చింటు:  ఏమో నాన్నా.. అప్పుడే ఎలా తెలుస్తుంది.. పూర్తి అయితే కానీ తెలీదు.

నాన్న: ఆఁ!!

నిజమే మరి!

కిట్టు: చాలా కష్టపడి రన్నింగ్‌ రేస్‌లో పాల్గొన్నావు కదా బిట్టూ.. ఇంతకీ ఏమొచ్చింది?
బిట్టు: విపరీతమైన ఆయాసం వచ్చింది కిట్టూ...
కిట్టు: ఆఁ!!

అలా అర్థమైందా!

చరణ్‌: నాన్నా! అన్నయ్య స్కూల్లో లాంగ్‌ జంప్‌, హై జంప్‌లో రికార్డులు బద్దలు కొట్టాడు తెలుసా?
నాన్న: వాడు ఇంటికి రానీ.. వాడి సంగతి చెబుతా. ఎప్పుడూ ఏదో ఒకటి పగలుకొడుతూనే ఉంటాడు.
చరణ్‌: ఆఁ!!

ఇంకా తెలియదు మరి!

టీచర్‌: తరుణ్‌... సంధులు చెప్పమంటే, అలా దిక్కులు చూస్తున్నావేంటి?
తరుణ్‌: మేం ఈ ఊరికి కొత్తగా వచ్చాం టీచర్‌. నాకింకా సందుల గురించి సరిగా తెలియదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని