నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: మూత్రపిండాలు ఎక్కడుంటాయి చింటూ?

Published : 07 Aug 2022 00:17 IST

నిజమే చెప్పాగా!

టీచర్‌: మూత్రపిండాలు ఎక్కడుంటాయి చింటూ?
చింటు: 34వ పేజీలో టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

మీ మాటే వింటున్నాం మరి!

నాన్న: ఏంట్రా గొడవ! అన్నదమ్ములన్నాక ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పాగా? ఇలా కొట్టుకుంటున్నారేం?
బంటి: మేమూ ఇచ్చి పుచ్చుకుంటున్నాం నాన్నా. నేను తమ్ముడికి ఒక దెబ్బ వేస్తే.. వాడూ నాకు ఒకటి ఇచ్చాడు.

నాన్న: ఆఁ!!

మీ మేలు కోరే!

కిట్టు: నాన్నా.. నాకు లెక్కల్లో వందకు వందమార్కులొస్తే ఏం చేస్తారు?
నాన్న: హార్ట్‌ఎటాక్‌తో హాస్పిటల్‌లో జాయిన్‌ అవుతా....!

కిట్టు: అందుకే మీ మేలు కోరి ఓ నలభై మార్కులు తెచ్చుకున్నా.
నాన్న: ఆఁ!!

దటీజ్‌ బిట్టూ!

టీచర్‌: సముద్రపు నీళ్లు ఉప్పగా ఎందుకుంటాయి?
బిట్టు: చేపల చెమట వల్ల టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని