నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: నీకు ఇష్టమైన ఊరేంటి?బంటి: స్కూలుండని ఏ ఊరైనా ఇష్టమే టీచర్‌.టీచర్‌: ఆఁ!!....

Published : 09 Aug 2022 00:31 IST

నిజమే మరి!

టీచర్‌: నీకు ఇష్టమైన ఊరేంటి?

బంటి: స్కూలుండని ఏ ఊరైనా ఇష్టమే టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

అంతేగా.. అంతేగా!

టీచర్‌: కిట్టూ.. 4 వంకాయలు, 5 టమోటాలు, 2 బంగాళాదుంపలు.. ఇవన్నీ కలిపితే..?

కిట్టు: కుర్మా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ బిట్టూ!

టీచర్‌: బిట్టూ... మధ్యయుగాన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారెందుకు?

బిట్టు: అప్పుడు కరెంటు లేదు కదా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

నిజంగా నిజం!

అంకుల్‌: టింకూ.. రోజూ స్కూల్‌కెళుతున్నావా?

టింకు: లేదంకుల్‌.. నేను పోను అని చెబుతున్నా, వినకుండా.. బలవంతంగా పంపిస్తున్నారు.

అంకుల్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని