నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: నువ్వు దేనిలోనూ ఫస్ట్‌ రావేంటి బంటీ?

Published : 10 Aug 2022 00:21 IST

వస్తున్నాగా..!

నాన్న: నువ్వు దేనిలోనూ ఫస్ట్‌ రావేంటి బంటీ?
బంటి: ఎందుకు రాను? బెల్‌ కొట్టగానే నేనే అందరికన్నా ఫస్ట్‌ బయటికొస్తాను తెలుసా!
నాన్న: ఆఁ!!

మీరే చెప్పారుగా!

టీచర్‌: అదేంటి టింకూ.. వెనక్కి తిరిగి నిల్చొని సమాధానం చెబుతున్నావు?
విద్యార్థి: మీరే కదా టీచర్‌.. పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదన్నారు.. అందుకని!
టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ బిట్టూ!

తాతయ్య: న్యాయానికీ, ధర్మానికీ విలువెక్కడుంది? ఇది కలికాలం కదా?
బిట్టు: కాదు.. ఇది వర్షాకాలం తాతయ్యా!

పెద్దలు చెప్పారని!

టీచర్‌: కిట్టూ.. రోజూ స్కూలుకు ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు?
కిట్టు: మీరే చెప్పారుగా టీచర్‌... ‘నిదానమే ప్రధానం’ అని..

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని