నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ.. టింకూను ఎందుకు కొట్టావు?

Published : 11 Aug 2022 00:24 IST

అంతేగా.. అంతేగా..!

టీచర్‌: చింటూ.. టింకూను ఎందుకు కొట్టావు?
చింటు: జీవితమన్నాక ఆటుపోట్లుంటాయి. ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుందని మీరే చెప్పారుగా టీచర్‌.

టీచర్‌: అవును! చెప్పాను.. అయితే!
చింటు: ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో టింకూకు చూపిద్దామని కొట్టా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ చరణ్‌!

చరణ్‌: చూశావా మమ్మీ.. ఈ రోజు టై, బెల్టు, ఐడెంటిటీ కార్డ్‌, షూస్‌ అన్నీ వేసుకుని స్కూలుకు రెడీ అయ్యాను.
అమ్మ: అవునా... ఈ రోజు ఆదివారం! 

మీరే అన్నారుగా!

తాతయ్య: కోడి ముందా.. గుడ్డు ముందా?
టింకు: కోడే ముందు తాతయ్యా!

తాతయ్య: అవునా.. ఎలా?
టింకు: మీరు ముందు కోడి అన్న తర్వాతే గుడ్డు అన్నారుగా!

తాతయ్య: ఆఁ!!

బిట్టునా.. మజాకా!

టీచర్‌: సూర్యుడు గొప్పవాడా.. చంద్రుడు గొప్పవాడా?
బిట్టు: చంద్రుడు గొప్పవాడు టీచర్‌.

టీచర్‌: ఎలా?
బిట్టు: సూర్యుడు అనవసరంగా పగటిపూట వెలుగుతాడు. చంద్రుడు మాత్రం రాత్రివేళ చీకటిగా ఉన్నప్పుడు వెలుగుతాడు కాబట్టి టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని