నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: బిట్టూ.. ఒకటి ప్లస్‌ ఒకటి రెండు, రెండు ప్లస్‌ రెండు నాలుగు, నాలుగు ప్లస్‌ నాలుగు ఎనిమిది.. ఆ లెక్కన ఎనిమిది ప్లస్‌ ఎనిమిది ఎంత?

Published : 13 Aug 2022 00:28 IST

ఇది తొండి!

టీచర్‌: బిట్టూ.. ఒకటి ప్లస్‌ ఒకటి రెండు, రెండు ప్లస్‌ రెండు నాలుగు, నాలుగు ప్లస్‌ నాలుగు ఎనిమిది.. ఆ లెక్కన ఎనిమిది ప్లస్‌ ఎనిమిది ఎంత?
బిట్టు: ఇది అన్యాయం టీచర్‌.. తేలికగా ఉన్న కూడికలన్నీ మీరు చెప్పేసి, కష్టమైనవి నన్ను అడుగుతున్నారు.

పేరులోనే ఉందని!

నాన్న: పరీక్ష ఇంత తొందరగా అయిపోయిందా?
టింకు: లేదు నాన్నా.. నన్ను మధ్యలోనే బయటకు పంపేశారు.

నాన్న: ఎందుకని?
టింకు: స్లిప్‌ టెస్టు అన్నారని, స్లిప్పులు పట్టుకొని వెళ్లా.

అర్థం చేసుకోరూ!

బామ్మ: ఏరా టిల్లూ.. ఏం చేస్తున్నావు?
టిల్లు: బొమ్మ గీస్తున్నా బామ్మా..

బామ్మ: వెరీగుడ్‌.. ఇంతకీ ఏం బొమ్మో?
టిల్లు: పిల్లి బొమ్మ..

బామ్మ: ఇక్కడ మొత్తం నల్ల రంగుతోనే నింపేశావు కదా.. మరి పిల్లేది?
టిల్లు: చీకట్లో ఉంది బామ్మా.. 

బామ్మ: చీకట్లో పిల్లి కళ్లు మెరుస్తాయి కదా.. అప్పుడు అవైనా కనిపించాలి కదా?
టిల్లు: నీకన్నీ సందేహాలే బామ్మా.. పిల్లి నిద్రపోతోంది..

బామ్మ: ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు