నవ్వుల్‌... నవ్వుల్‌..!

టీచర్‌: నీకు హాజరు శాతం తక్కువుంది. నిన్ను పరీక్షలో కూర్చోనివ్వను.

Published : 14 Aug 2022 00:42 IST

అయినా ఓకే!

టీచర్‌: నీకు హాజరు శాతం తక్కువుంది. నిన్ను పరీక్షలో కూర్చోనివ్వను.
చింటు: ఫర్వాలేదు టీచర్‌. నేను నిల్చుని రాస్తా.
టీచర్‌: ఆఁ!!

బిట్టూనా మజాకా!

కిట్టు: బిట్టూ.. నువ్వు హోం వర్క్‌ ఎందుకు చేయలేదు?
బిట్టు: చేయని వాళ్లను, టీచర్‌ ఇంటికి పంపిస్తారట కదా!
కిట్టు: ఆఁ!!

అంతేగా.. అంతేగా...!

చంటి: ‘30 రోజుల్లో ఆంగ్ల భాష’ పుస్తకాన్ని చదివితే ఒక్క నెలలో ఇంగ్లిష్‌ వస్తుందట.
బంటి: అయితే.. 30 పుస్తకాలు కొనుక్కుని ఒక్క రోజులో నేర్చేసుకుంటా..
చంటి: ఆఁ!!

దటీజ్‌ టింకూ!

టీచర్‌: జవాబులు రాయకుండా తెల్లకాగితం ఇచ్చేశావేం?
టింకు: శుభ్రతకు అయిదు మార్కులు వేస్తున్నారని తెలిసి, కనీసం ఆ అయిదు మార్కులన్నా తెచ్చుకుందామని!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని