నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: ఎందుకు చింటూ.. మందు బిళ్లను అలా అని వైపులా కత్తిరిస్తున్నావు?

Published : 15 Aug 2022 01:43 IST

ఎందుకైనా మంచిదని!

నాన్న: ఎందుకు చింటూ.. మందు బిళ్లను అలా అని వైపులా కత్తిరిస్తున్నావు?
చింటు: సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకుండా ఉండటం కోసం నాన్నా.
నాన్న: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

టీచర్‌: కిట్టూ.. బిట్టూను ఎందుకలా కొట్టావు?
కిట్టు: బిట్టూ నన్ను నెల రోజుల క్రితం ఇంగ్లిష్‌లో తిట్టాడు టీచర్‌.
బిట్టు: నెలరోజుల క్రితం తిడితే ఇప్పుడు కొట్టడం ఏంటి?
కిట్టు: దాని అర్థం నాకు ఇప్పుడే తెలిసింది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

దెబ్బకు దెబ్బ!

అంకుల్‌: ఏంటి టింకూ.. చీమల్ని తింటున్నావు.
టింకు: ఆ చీమలు నా చాక్లెట్‌ను తిన్నాయి మరి. అందుకే నేను ఆ చీమల్ని తింటున్నా.
అంకుల్‌: ఆఁ!!

జాగ్రత్త నాయనా!

చిన్ను: బామ్మా.. రేపు నేను పరుగుపందెంలో పాల్గొనబోతున్నా..
బామ్మ: జాగ్రత్త నాయనా.. కాస్త నెమ్మదిగా పరిగెత్తు. కిందపడితే దెబ్బలు తగులుతాయి.
చిన్ను: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని