Published : 18 Aug 2022 01:21 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అయ్య బాబోయ్‌!

టీచర్‌: ఒకతని పర్సు కిందపడిపోతే, నేను పిలిచి మరీ ఇచ్చా. దీని ద్వారా నీకేం అర్థమైంది చింటూ!

చింటు: మీకు దొరికిన పర్సులో డబ్బుల్లేవని.

టీచర్‌: ఆఁ!!


అది నాపనే!

టింకు: బంటీ.. నీ గొడుగుకు చిల్లు పడింది.

బంటి: లేదు... నేనే పెట్టా.

టింకు: అవునా.. ఎందుకు?

బంటి: వర్షం తగ్గిందో లేదో చూడటానికి!

టింకు: ఆఁ!!


అవునా.. నిజమా!

టీచర్‌: ఇప్పటికీ కరెంట్‌ కనిపెట్టి ఉండకపోయి ఉంటే ఏమయ్యేది?

కిట్టు: స్మార్ట్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టుకోవడం కష్టమై ఉండేది.

టీచర్‌: ఆఁ!!


నిజమే కదా..!

టీచర్‌: కిట్టూ.. ఏ నెలలో 28 రోజులుంటాయి.

లత: అన్ని నెలల్లో ఉంటాయి టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని