నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అమ్మా అమ్మా.. ‘నిలువు గాడిద’లు ఉండవా?...

Updated : 16 Sep 2022 14:10 IST

ఎన్ని తెలివితేటలో..

అంకుల్‌ : చంటీ.. క్లాసులో నువ్వెక్కడ కూర్చుంటావు?
చంటి : మామూలు రోజుల్లో అయితే అల్లరి చేసే పండుగాడి పక్కన, పరీక్షలో అయితే క్లాసు ఫస్టొచ్చే రామూ పక్కన అంకుల్‌..
అంకుల్‌ : ఆ..!!

పెద్ద డౌటే!

అన్వి : అమ్మా అమ్మా.. ‘నిలువు గాడిద’లు ఉండవా?
అమ్మ : ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది అన్వీ..!
అన్వి : మరేం లేదమ్మా.. నాన్న ఎప్పుడూ గాడిద, అడ్డ గాడిద అనే తిడతారు కానీ నిలువు గాడిద అనరు కదా.. అందుకే డౌటొచ్చింది.

కొన్నిసార్లు అంతే..

నాన్న : ఏరా టింకూ.. మొన్నటి పరీక్షల్లో క్లాసు మొత్తంలో నీదే లాస్ట్‌ ర్యాంకు అట కదా?
టింకు : అందులో నా తప్పేం లేదు నాన్నా.. ఎప్పుడూ లాస్ట్‌ వచ్చే ఆ టిల్లూ వేరే స్కూల్‌కి మారిపోయాడు మరి!
నాన్న :  ఆ..!!

సొంతంగానే..

టీచర్‌ : పిల్లలూ.. మొన్నటి సెలవుల్లో ఎవరెవరు ఏమేం నేర్చుకున్నారో చెప్పండి..
కిట్టు : స్విమ్మింగ్‌ టీచర్‌..
మిట్టు : డ్రాయింగ్‌ టీచర్‌..
బిట్టు : అల్లరి చేయడం నేర్చుకున్నా టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని