Published : 21 Aug 2022 01:04 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...!

అంతేగా... అంతేగా...!

టీచర్‌: రోజూ జీడిపప్పు తింటే ఏమవుతుంది?
టింకు: జేబులు ఖాళీ అవుతాయి టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

నేను చూడలేదు అమ్మా!

అమ్మ: ఈ డబ్బాలో ఒకటే లడ్డూ ఉందేంటి?
బిట్టు: ఇంకా ఒకటి మిగిలి ఉందా అమ్మా.. అయ్యో.. నేను సరిగా చూడలేదే!
అమ్మ: ఆఁ!!

నిజమే మరి!

నాన్న: కాలం కరిగిపోతుంది. అందుకే వృథా చేయొద్దు.
చింటు: ఐస్‌క్రీం కూడా కరిగిపోతుంది నాన్నా. అందుకే ముందు ఐస్‌క్రీం సంగతి చూశాక.. తర్వాత కాలం గురించి ఆలోచిస్తా...
నాన్న: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

నాన్న: ఏంటి బిట్టూ.. సీరియస్‌గా ఏదో తయారు చేస్తున్నావు?
బిట్టు: క్యాలెండర్‌ నాన్నా...

నాన్న: గుడ్‌.. ఏదీ ఇటివ్వు. అదేంటి అన్నీ ఆదివారాలే ఉన్నాయి.
బిట్టు: ఆదివారం స్కూలు ఉండదు కదా నాన్నా.. అందుకే అన్నీ ఆదివారాలే రాశాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని