నవ్వుల్‌... నవ్వుల్‌...!

నాన్న: చింటూ.. నీకు స్కూల్లో రెండు బహుమతులు దేనికొచ్చాయి?

Published : 22 Aug 2022 00:21 IST

గుర్తుకు రావడం లేదు

నాన్న: చింటూ.. నీకు స్కూల్లో రెండు బహుమతులు దేనికొచ్చాయి?
చింటు: ఒకటేమో జ్ఞాపకశక్తికి, రెండోది దేనికోసమో గుర్తుకు రావడం లేదు నాన్నా.
నాన్న: ఆఁ!!

ముందే చూసి కొనాల్సింది!

బంటి: అసాధ్యం అనే పదం నా డిక్షనరీలోనే లేదు.
చంటి: అయ్యో.. కొనేటప్పుడే చూసుకోవాల్సింది.
బంటి: ఆఁ!!

అంతేగా... అంతేగా..!

కిట్టు: నాన్నా.. నేను స్కూల్లో లాంగ్‌జంప్‌లో రికార్డులు బద్దలు కొట్టాను.
నాన్న: రోజూ ఏదో ఒకటి బద్దలు కొడుతూనే ఉంటావా.. దాని ఖరీదు ఎంతో చెప్పు. స్కూల్లో కట్టేద్దాం.
కిట్టు:  ఆఁ!!

మీరే చెప్పారు కదా!

టీచర్‌: బిట్టూ... బెల్‌ కొట్టకుండానే ఇంటికి ఎందుకు బయలుదేరుతున్నావు?
బిట్టు: మీరే చెప్పారు కదా టీచర్‌. ఆలస్యం అమృతం విషం అని...
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని