నవ్వుల్‌... నవ్వుల్‌...!

అంకుల్‌: ఏంటి కిట్టూ.. అలా నిల్చొని తింటున్నావు? హాయిగా కూర్చొని తినొచ్చు కదా!

Published : 25 Aug 2022 00:21 IST

బామ్మ చెప్పారు మరి!

అంకుల్‌: ఏంటి కిట్టూ.. అలా నిల్చొని తింటున్నావు? హాయిగా కూర్చొని తినొచ్చు కదా!
కిట్టు: కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని మా బామ్మ చెప్పింది అంకుల్‌.

అంకుల్‌: ఆఁ!!

క్లారిటీ ఉండాలిగా మరి!

టీచర్‌: బంటీ.. ఏబీసీడీలు చెప్పు?
బంటి: స్మాల్‌ లెటర్స్‌లో చెప్పనా.. క్యాపిటల్‌ లెటర్స్‌లో చెప్పనా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

డాక్టర్‌ చెప్పారు టీచర్‌!

లెక్కల టీచర్‌: ఏంటి కిట్టూ.. నేను నీ దగ్గరికి రాగానే కళ్లద్దాలు పెట్టుకుంటున్నావు. నేను కాస్త దూరం వెళ్లగానే తీస్తున్నావు. అసలు నీ సమస్య ఏంటి?
కిట్టు: తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఈ కళ్లద్దాలు పెట్టుకోవాలి అని డాక్టర్‌ చెప్పారు టీచర్‌.

లెక్కల టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని