Updated : 27 Aug 2022 06:32 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...!

ఎలా పలకాలబ్బా?

అంకుల్‌ : ఏంటి మిట్టూ.. దేని గురించో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు?
మిట్టు : మరేం లేదు అంకుల్‌.. ఒకవేళ నా పేరు నేను మరిచిపోతే, ఎవరైనా పిలిచినప్పుడు ఎలా పలకాలా అనీ..
అంకుల్‌ : ఆ..!!

సిగ్గెక్కువే!

రవి : అమ్మా అమ్మా.. నా నీడకు కూడా నాలాగే సిగ్గెక్కువ తెలుసా..!
అమ్మ : అదేంటి?
రవి : అవునమ్మా.. నీడ కూడా నాలాగే నిక్కరేసుకుంది కదా మరి..

భలే భలే..

నాన్న : ఏంటి బాలూ.. బడికి వెళ్లనంటున్నావంటా?
బాలు : అవును నాన్నా.. మా టీచర్‌ అన్నీ అబద్ధాలే చెబుతున్నారు..

నాన్న : ఏం చెప్పారేంటి?
బాలు : గడిచిన సమయం మళ్లీ రాదని చెప్పారు. కానీ, నేను బడికి వెళ్లాల్సిన సమయం ఈరోజు మళ్లీ వచ్చింది కదా నాన్నా..

నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు