Published : 28 Aug 2022 00:23 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...!

అంతేగా.. అంతేగా...!

టీచర్‌: బంటీ.. ఎనిమిదిలో సగం ఎంత?
బంటి: అడ్డంగా కోస్తే సున్నా, నిలువుగా కోస్తే మూడు టీచర్‌..
టీచర్‌: ఆఁ!!

అయ్యబాబోయ్‌!

టీచర్‌: రోజు ఎలా ప్రారంభమై, ఎలా ముగుస్తుంది.. చింటూ నువ్వు చెప్పు?
చింటు: పొద్దున పూరీతో ప్రారంభమై.. సాయంత్రం పానీపూరీతో ముగుస్తుంది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ కిట్టూ!

నాన్న: కిట్టూ.. నీ మ్యాథ్స్‌ బుక్‌ ఇటు తీసుకురా.
కిట్టు: లేదు నాన్నా..

నాన్న: లేదా.. ఏమైంది?
కిట్టు: నేనే పారేశా నాన్నా.

నాన్న: అవునా.. ఎందుకు?
కిట్టు: మన పక్కింటి అంకుల్‌తో, మొన్న మీరే అన్నారుగా... ‘ప్రాబ్లమ్స్‌ని మనతో మోయకూడదు. అలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉండదని..!’

నాన్న: ఆ.. అన్నాను.. అంటే..!
కిట్టు: మరి నా మ్యాథ్స్‌ బుక్‌లో అన్నీ ప్రాబ్లమ్సే ఉన్నాయి నాన్నా.. అందుకే పారేశా..

నాన్న: ఆఁ!!

కరెక్టుగానే చేసిందిగా..

టీచర్‌ : ఏంటి రాధా.. పరీక్ష పేపర్‌పైన నీ పేరు అడ్డంగా రాసి, మీ నాన్నది నిలువుగా రాశావు?
రాధ : మా నాన్న ఎప్పుడూ ఒకే మాట చెబుతుంటారు టీచర్‌.. ‘నా పేరు నిలబెట్టాలి’ అనీ..
టీచర్‌ : ఆఁ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు