నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: చింటూ నువ్వు ఎందుకు హోం వర్క్‌ చేయడం లేదు.

Updated : 29 Aug 2022 06:35 IST

దటీజ్‌ చింటూ!

టీచర్‌: చింటూ నువ్వు ఎందుకు హోం వర్క్‌ చేయడం లేదు.
చింటు: నా పర్సనల్‌ లైఫ్‌లో స్కూల్‌ లైఫ్‌ను మిక్స్‌ చేయడం నాకిష్టం లేదు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

టీచర్‌: కిట్టూ.. నువ్వెందుకు రోజూ ఆలస్యంగా వస్తున్నావు?
కిట్టు: సరే టీచర్‌.. రేపటి నుంచి రాను.

టీచర్‌: గుడ్‌.. అయితే రేపటి నుంచి నువ్వు త్వరగా స్కూలుకు వస్తావన్నమాట.
కిట్టు: లేదు టీచర్‌.. అసలు స్కూల్‌కే రాను!

టీచర్‌: ఆఁ!!

చెప్పడం లేదు మరి!

బంటి: చంటీ.. మా కుక్క పేరు టామీ. మరి మీ కుక్క పేరు.
చంటి: ఏమోరా.. ఎంత అడిగినా అది భౌ.. భౌ.. అంటోందే కానీ.. దాని పేరు అస్సలు చెప్పడం లేదు.
బంటి:  ఆఁ!!

క్లారిటీ ఉండాలిగా..

అమ్మ: టింకూ... అన్నం వదిలేస్తే బాగోదు. అర్థమవుతోందా?
టింకు: సరే అమ్మా..! మరి కూర వదిలేయొచ్చా?

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని