నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: అరటి పండు గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు టింకూ?

Published : 30 Aug 2022 00:09 IST

నిజమేగా!

టీచర్‌: అరటి పండు గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు టింకూ?

టింకు: తింటే బలపడతాం.. తొక్కితే జారి పడతాం టీచర్‌.

టీచర్‌:ఆఁ!!


గొప్ప ఆలోచనే!

టీచర్‌: ఏంటి కిట్టూ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?

కిట్టు: ‘ధరలకు రెక్కలొచ్చాయి’ అని మా నాన్న అమ్మతో అంటుంటే విన్నా. పక్షులకు కదా రెక్కలుండేది. ధరలు కూడా పక్షులేనా? కాదా? అని ఆలోచిస్తున్నా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


బంటీ థియరీ!

టీచర్‌: అమావాస్య ఎందుకు వస్తుంది?

బంటి: పౌర్ణమి విలువ మనకు తెలిసేలా చేయడం కోసమే అమావాస్య వస్తుంది టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


ఇది దారుణం!

టీచర్‌: దారుణం అంటే ఏంటి?

కిట్టు: ‘దా’ అనే పేరున్న వ్యక్తి తీసుకున్న రుణాన్నే... దారుణం అంటారు టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని