Published : 31 Aug 2022 00:18 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

లాజిక్కే కదా..

అమ్మ : ఏంటి కిట్టూ.. తాతయ్య మీద చిరాకు పడుతున్నావు?
కిట్టు : అవునమ్మా.. పూర్తిగా కాకుండా, అన్నీ సగం సగమే చెబుతున్నారు.

అమ్మ : ఇప్పుడేమైంది?
కిట్టు : ఉదయం నుంచి కాళ్లు లాగుతున్నాయని తనలో తానే బాధపడుతున్నారు కానీ, ఎటువైపో చెప్పడం లేదు..

అమ్మ : ఆ..!!

భలే తెలివి!

టీచర్‌ : రాధికా.. అడ్రస్‌ రాయమంటే మెట్ల బొమ్మ గీశావేంటి?
రాధిక : మేమందరమూ మిద్దెపైనున్న ఇంట్లోనే ఉంటాం టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

అబ్బా.. ఎంత పనైంది..

అంకుల్‌ : ఏంటి రాహుల్‌.. దిగులుగా ఉన్నావు?
రాహుల్‌ : అవును అంకుల్‌..

అంకుల్‌ : ఏం జరిగింది?
రాహుల్‌ : కరోనా వల్ల మళ్లీ స్కూళ్లకు సెలవులు వస్తాయి అనుకుంటే... కేసులు పెద్దగా పెరగట్లే. అందుకే లాక్‌డౌన్లూ విధించడం లేదు. మంకీపాక్స్‌ కేసులు కూడా అంతే.. బొత్తిగా లేవు. అందుకే దిగులుగా ఉన్నా అంకుల్‌. 

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని