Published : 02 Sep 2022 00:46 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అయ్య బాబోయ్‌!

టీచర్‌: ఇంతకీ నిరాహారదీక్ష అంటే ఏంటి టింకూ?
టింకు: నీరు, ఆహారం మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

రెండుసార్లు ఎందుకని!

అమ్మ: చింటూ.. భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలని తెలియదా?
చింటు: ఎలాగూ తిన్నాక కడుక్కుంటా కదా అమ్మా.. చేయబోయే పనినే మళ్లీ చేయడం ఎందుకని!
అమ్మ: ఆఁ!!

ఇదేం ఐడియా!

టీచర్‌: రైలు ప్రమాదాలు తగ్గాలంటే ఏం చేయాలి?
కిట్టు: ఏముంది టీచర్‌.. రోడ్డు మీద స్పీడ్‌ బ్రేకర్లు వేసినట్లే.. రైలు పట్టాల మీద స్పీడ్‌ బ్రేకర్లు వేయిస్తే సరి!
టీచర్‌: ఆఁ!!

అవే ఆనవాళ్లు మరి!

బిట్టు: అంకుల్‌.. మా కుక్క తప్పిపోయింది.
ఎస్‌.ఐ.: ఓ.. అవునా.. ఏమైనా ఆనవాళ్లు చెప్పు బాబూ!

బిట్టు: ఎప్పుడూ భౌ..భౌ.. అంటుంది. అప్పుడప్పుడు తోక ఊపుతుంది అంకుల్‌!
ఎస్‌.ఐ.: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని