Published : 03 Sep 2022 00:18 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

అంతేనా..!

అక్క : చింటూ చింటూ.. పరుగు పందెం పోటీల్లో ఫస్టు వచ్చావట కదా?
చింటు : అవునక్కా..

అక్క : మరి ఏమిచ్చారేంటి?
చింటు : గ్లాసుడు మంచినీళ్లు..

అక్క : ఆ..!!

ఎంత పనైందో?

టీచర్‌ : రెండు రెళ్లు ఎంత మిట్టూ?
మిట్టు : నాలుగు టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. ఇదిగో ఈ నాలుగు చాక్లెట్లు నీకే తీసుకో..
మిట్టు : అయ్యో.. ఇలా అని తెలిస్తే, ఇరవై అని చెప్పేవాడిని కదా!

అలా అర్థమైందా?

లత : నాన్నా నాన్నా.. మా టీచర్‌కు దేవుడంటే బోలెడంత భక్తి.
నాన్న : అవునా.. నీకెలా తెలుసు?

లత : నేను ఏ సమాధానం చెప్పినా.. ‘ఓ మై గాడ్‌’ అని అంటుంటారు..
నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని