నవ్వుల్‌...! నవ్వుల్‌...!

అంకుల్‌ : ఏంటి టిల్లూ.. వెనక్కి తిరిగి నడుస్తున్నావు?

Published : 07 Sep 2022 00:18 IST

భలే భలే..

అంకుల్‌ : ఏంటి టిల్లూ.. వెనక్కి తిరిగి నడుస్తున్నావు?
టిల్లు : మరేం లేదు అంకుల్‌.. వెనక నుంచి నన్ను గుర్తుపడతారో లేదో తెలుసుకుందామని..

అంకుల్‌ : ఆ..!!

అబ్బా.. అలాగా!

పింకి : టీచర్‌ టీచర్‌.. మన జనాభా లెక్కలు తప్పు టీచర్‌..
టీచర్‌ : ఎందుకలా అంటున్నావు?

పింకి : మొన్న జనాభా లెక్కల వాళ్లు మా ఇంటికి వచ్చినప్పుడు నేను, చెల్లి దాక్కున్నాము కాబట్టి..
టీచర్‌ : ఆ..!!

కిట్టూనా మజాకానా?

అమ్మ : కిట్టూ.. పరీక్షలు దగ్గరికొస్తున్నా.. నువ్వసలే చదవడం లేదేంటి?
కిట్టు : అదేంటోనమ్మా.. సైకిల్‌ని చూస్తే తొక్కాలనిపిస్తుంది.. ఫోన్‌ చూస్తే గేమ్స్‌ ఆడుకోవాలనిపిస్తుంది.. టీవీ ఆన్‌ చేస్తే సినిమా చూడాలనిపిస్తుంది కానీ పుస్తకం తెరిస్తే మాత్రం చదవబుద్ధి కావడం లేదు..

అమ్మ : ఆ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని