నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అయిదేళ్ల శ్రీవాణి మొట్టమొదటిసారి బడికి వెళ్లి వచ్చింది. అప్పుడు వాళ్ల అమ్మ ఆమెను ఇలా అడుగుతోంది..

Published : 08 Sep 2022 00:29 IST

అంతేగా.. అంతేగా..!

(అయిదేళ్ల శ్రీవాణి మొట్టమొదటిసారి బడికి వెళ్లి వచ్చింది. అప్పుడు వాళ్ల అమ్మ ఆమెను ఇలా అడుగుతోంది..)
అమ్మ: అమ్మా శ్రీవాణీ.. బడి మొదటి రోజు ఎలా ఉంది?
శ్రీవాణి: అదేంటమ్మా.. మొదటిరోజు అంటున్నావు. రేపు మళ్లీ బడికి వెళ్లాల్సి ఉంటుందా?

అమ్మ: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

టీచర్‌: కీర్తనా.. భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా?
కీర్తన: భూమి తన చుట్టూ తాను తిరిగీ తిరిగీ కళ్లు తిరిగి పడిపోయినప్పుడు టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

ఒక్కసారి ఆలోచించండి!

టీచర్‌: ఏంటి చరణ్‌... సీరియస్‌గా ఏదో లెటర్‌ రాస్తున్నావు?
చరణ్‌: వినతి పత్రం టీచర్‌.

టీచర్‌: వినతి పత్రమా! దేనికోసం?
చరణ్‌: మాకు మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు కావాలని టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

నన్ను శిక్షించరు కదా!

బంటి: టీచర్‌.. నేను చేయని పనికి నేను బాధ్యుణ్ని కాదు కదా?
టీచర్‌: అవును.. కాదు.

బంటి: అంటే నా తప్పేమీ ఉండదు కదా!
టీచర్‌: అవును.. ఉండదు.

బంటి: అయితే నేను హోం వర్క్‌ చేయలేదు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని