నవ్వుల్‌...!నవ్వుల్‌...!

అమ్మ : అదేంటి చంటీ.. నీ ఆన్సర్‌ పేపర్‌లో ఏమీ లేదు?

Published : 13 Sep 2022 00:44 IST

అంతేగా..

అమ్మ : అదేంటి చంటీ.. నీ ఆన్సర్‌ పేపర్‌లో ఏమీ లేదు?
చంటి : మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉంటుందా అమ్మా?
అమ్మ : ఉండదు..
చంటి : మరి.. మైసూర్‌ పాక్‌లో మైసూర్‌?
అమ్మ : ఉండదు..
చంటి : నా ఆన్సర్‌ షీట్‌ కూడా అంతేనమ్మా..
అమ్మ : ఆ..!!


సేమ్‌ టు సేమ్‌..

పద్మ : టీచర్‌ టీచర్‌.. నేనో కొత్త విషయం కనిపెట్టా టీచర్‌..
టీచర్‌ : వెరీగుడ్‌.. ఏంటది పద్మ!
పద్మ : చీకట్లో ముందు నుంచైనా, వెనక నుంచైనా ఒకేలా కనిపిస్తాం టీచర్‌..
టీచర్‌ :ఆ..!!


భలే.. భలే..

బిట్టు : మిట్టూ.. నాకూ, నా వీపునకూ అస్సలే పడదు..
మిట్టు : అదేంటి?
బిట్టు : అందుకే, నేను ముందుంటే.. వీపు వెనకాల ఉంటుంది..
మిట్టు : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని