నవ్వుల్‌...! నవ్వుల్‌...!

అమ్మ: కూర ఎలా ఉంది బంటీ?

Updated : 16 Sep 2022 06:02 IST

ఓరి నాయనో!

అమ్మ: కూర ఎలా ఉంది బంటీ?

బంటి: పావుకిలో వంకాయలకు బదులు అరకిలో వండాల్సింది.

అమ్మ:ఏ.. బంటీ కూర అంత నచ్చిందా?

బంటి: కాదమ్మా... అప్పుడు ఉప్పు సరిగ్గా సరిపోయేది.

అమ్మ: ఆఁ!!


హింస పాపమే కదా!

చింటు: టీచర్‌.. జీవహింస పాపం కదా.

టీచర్‌: అవును చింటూ.. పాపమే..

చింటు: మరి ఎగ్జామ్స్‌, మార్కులు, హోంవర్క్‌లు అని మీరు మమ్మల్ని ఎందుకు హింసిస్తారు. మేమూ జీవులమే కదా!

టీచర్‌: ఆఁ!!


నిజమే మరి..

టిల్లు : నాన్నా నాన్నా.. స్కూల్‌ నుంచి వచ్చేటప్పుడు మన వీధి చివరిలో ఈ పర్సు దొరికింది నాన్నా..

నాన్న : టిల్లూ.. నిజంగానే దొరికిందా?

టిల్లు : నిజం నాన్నా.. కావాలంటే మీరే చూడండి.. ఆ అంకుల్‌ తన పర్సు కోసం ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని