నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఏంటి కిట్టూ ఆన్సర్‌ పేపర్‌లో ఏమీ రాయకుండా ఖాళీగా ఇస్తున్నావు?

Updated : 18 Sep 2022 00:52 IST

మీరు చెప్పారని!

టీచర్‌: ఏంటి కిట్టూ ఆన్సర్‌ పేపర్‌లో ఏమీ రాయకుండా ఖాళీగా ఇస్తున్నావు?

కిట్టు: మీరే చెప్పారు కదా టీచర్‌... కొట్టివేతలు లేకుండా శుభ్రంగా ఉంటే అయిదు మార్కులు ఇస్తా అని.

కిట్టు: ఆఁ!!


అంతేగా.. అంతేగా...!

టీచర్‌:ఆత్మకథ అంటే ఏంటో తెలుసా?

బిట్టు: ఓ తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. అయితే చెప్పు బిట్టూ!

బిట్టు: ఆత్మలు రాసుకునే కథనే ఆత్మకథ అంటారు టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


అయ్యబాబోయ్‌!

నాన్న: నేనంటే రోజు రోజుకూ నీకు లెక్కలేకుండా పోతోంది.

డుంబు: నాకు అసలు లెక్కలే రావు నాన్న. అందుకే మీరంటే నాకు లెక్కలేదు.

నాన్న: ఆఁ!!


ఎంత తెలివో...!

టీచర్‌: ఈ కరోనా టైంలో మాస్కుల వల్ల ఉపయోగాలేంటో చెప్పు టింకూ.

టింకు: కరోనా టైంలో ఏమో కానీ క్లాస్‌ టైంలో మాత్రం చాలా ఉపయోగాలున్నాయి టీచర్‌. మాలో ఎవరు అల్లరి చేస్తున్నారో మీరు అంత సులువుగా తెలుసుకోలేరు.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని