నవ్వుల్‌... నవ్వుల్‌...!

చింటు: హింసను విడనాడితే శాంతి విరాజిల్లుతుంది కదా టీచర్‌.

Published : 19 Sep 2022 00:33 IST

దటీజ్‌ చింటూ!

చింటు: హింసను విడనాడితే శాంతి విరాజిల్లుతుంది కదా టీచర్‌.
టీచర్‌: గుడ్‌.. అవును చింటూ!

చింటు: అయితే మీరు హోం వర్క్‌ ఇవ్వడం మానేయండి టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

అయ్యబాబోయ్‌!

బిట్టు: నీకు మనిషికాని మనిషి ఎవరో తెలుసా?
కిట్టు: తెలియదు నువ్వే చెప్పు బిట్టూ..!

బిట్టు: డాబర్‌ మ్యాన్‌.
కిట్టు: ఆఁ!!

అంతేగా.. అంతేగా...!

టీచర్‌: అద్భుతమైనవి అరుదుగానే ఉంటాయి. దీనికో ఉదాహరణ చెప్పు టింకూ?
టింకు: ఆదివారం అద్భుతమైంది. వారంలో అరుదుగా ఒక్క రోజు మాత్రమే వస్తుంది టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని