నవ్వుల్‌...! నవ్వుల్‌...!

నాన్న: ఒరేయ్‌... మన టామీ మీద ఏం రాస్తున్నావు రా?

Published : 21 Sep 2022 00:07 IST

టీచరే చెప్పారు నాన్నా! 

నాన్న: ఒరేయ్‌... మన టామీ మీద ఏం రాస్తున్నావు రా?

తరుణ్‌: మరి మా టీచర్‌.. కుక్క మీద వ్యాసం రాసుకురమ్మన్నారుగా.. అందుకని..

నాన్న: ఆఁ!!


దటీజ్‌ డుంబు!

డుంబు: అంకుల్‌ మీరు ఎంత వరకు చదువుకున్నారు?

అంకుల్‌: తీ.తి. వరకు చదువుకున్నా డుంబూ!

డుంబు:చదివిందే రెండక్షరాలు. అవి కూడా రివర్సులోనా...

అంకుల్‌: ఆఁ!!


మంచిదని తినేశా!

అమ్మ: బంటీ.. ఇక్కడ లైఫ్‌బాయ్‌ సబ్బు పెట్టాను.. ఏదీ?

బంటి: ఆరోగ్యానికి మంచిదని, టీవీలో చెబితే తినేశా!

అమ్మ:ఆఁ!!


మాత్రలు కావాల్సిందే!

టింకు: నాన్నా... ఓ వంద తలనొప్పి మాత్రలు అమ్మకు తెచ్చివ్వవా?

నాన్న: వందా.. అన్ని ఎందుకు?

టింకు: మాకు త్వరలో దసరా సెలవులు ఇవ్వబోతున్నారోచ్‌!

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని