నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌ : రాధా.. అలా వణుకుతున్నావేంటి? జ్వరం వచ్చిందా?

Published : 22 Sep 2022 00:21 IST

ముందుచూపు..

టీచర్‌ : రాధా.. అలా వణుకుతున్నావేంటి? జ్వరం వచ్చిందా?
రాధ : కాదు టీచర్‌.. రాబోయేది చలికాలం కదా..

టీచర్‌ : ఆ.. అయితే.?
రాధ : వణకడం ప్రాక్టీస్‌ చేస్తున్నా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

భలే తెలివి!

అంకుల్‌ : ఏంటి చింటూ.. నిన్న నడుచుకుంటూ వెళ్తుంటే, నీ చేతిలోని ఫోన్‌ను దొంగలు ఎత్తుకెళ్లిపోయారట?
చింటు : అవును అంకుల్‌..

అంకుల్‌ : అప్పుడే గట్టిగా కేకలు వేసి, ఎవరినైనా పిలవాల్సింది..
చింటు : మరేం ఫర్వాలేదు అంకుల్‌.. నా ఫోన్‌ను ఆ దొంగలు ఉపయోగించుకోలేరు..

అంకుల్‌ : ఎందుకలా?
చింటు : దాని ఛార్జర్‌ను నా దగ్గరే భద్రంగా దాచిపెట్టాను కాబట్టి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని