నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌: అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న.

Published : 23 Sep 2022 01:24 IST

భలే అనుమానం!

టీచర్‌: అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న.

బంటి: మరి చపాతీ దానం టీచర్‌..?

టీచర్‌: ఆఁ!!


అంతా గజిబిజి!

రాము: నేను సోముతో చెప్పొద్దని నీతో చెప్పిన విషయాన్ని నువ్వు సోముతో చెప్పావని, సోము నాతో చెప్పాడు.

రాజు: అయినా నేను సోముతో చెప్పినట్లు నీతో చెప్పొద్దని సోముతో చెప్పానే.

రాము: సరే పోనీలే.. ఎవర్నని ఏం లాభం.. సోము నాతో చెప్పాడని, నేను నీతో చెప్పినట్లు నువ్వు మళ్లీ సోముకు చెప్పకు సరేనా!


డాక్టరే చెప్పారు మరి!

(టానిక్‌ కొనుక్కోవడానికి బిట్టూ మందుల దుకాణానికి వెళతాడు)

బిట్టు: అంకుల్‌ ఈ చీటీలో ఉన్న టానిక్‌తోపాటు ఓ ముప్ఫై మూతలు ఇవ్వండి.

అంకుల్‌: టానిక్‌ సరే బాబూ.. ముప్ఫై మూతలు ఎందుకు?

బిట్టు:ఈ టానిక్‌.. రోజూ ఓ మూత చొప్పున నెలరోజుల వరకు వేసుకోమన్నాడు డాక్టర్‌. అందుకే ముప్ఫై మూతలు కూడా కావాలి.

అంకుల్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు