Published : 24 Sep 2022 00:24 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

జారాల్సిందే..

అంకిత్‌ : నాన్నా నాన్నా.. నేనో విషయం కనిపెట్టానోచ్‌..
నాన్న : అలాగా.. ఏంటో అది?

అంకిత్‌ : జారుడు బల్ల ఎక్కిన ప్రతి ఒక్కరూ కిందకు జారాల్సిందే..
నాన్న : ఆ..!!

సరైన సందేహమే!

టీచర్‌ : పిల్లలూ.. పాఠం విన్నారు కదా.. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి.
పింకి : టీచర్‌.. నాకో డౌటుంది.

టీచర్‌ : ఏంటది?
పింకి : చనిపోయిన వాళ్లు మళ్లీ బతకడం అసాధ్యం కదా టీచర్‌..

టీచర్‌ : అవును..
పింకి : ‘చచ్చి బతికాను’ అని మా తాతయ్య ఎప్పుడూ అబద్ధమే చెబుతుంటాడు..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని