నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: బంటీ.. నీ మ్యాథ్స్‌ బుక్‌ ఏది?

Published : 26 Sep 2022 00:58 IST

దటీజ్‌ బంటీ!

టీచర్‌: బంటీ.. నీ మ్యాథ్స్‌ బుక్‌ ఏది?

బంటి: సమస్యలకు దూరంగా ఉండాలని మొన్న మీరే చెప్పారుగా టీచర్‌. అందుకే దాన్ని చెత్తబుట్టలో పారేశా.

టీచర్‌: ఆఁ!!


అయ్యబాబోయ్‌!

అమ్మ: చింటూ.. పక్కింటి వాళ్ల టామీని కరిచావంట.. ఎందుకు? అయినా కుక్కల్ని నువ్వు కరవడం ఏంట్రా?

చింటు: అది నన్ను చూసి మొరిగిందమ్మా.. అందుకే దాన్ని కరిచా.

అమ్మ: ఆఁ!!


క్లారిటీ ఉండాలిగా...

అమ్మ: అన్నం వదిలేశావో.. నీకు దెబ్బలు తప్పవు టింకూ.. అర్థమైందా?

టింకు: మరి కూర వదిలేయొచ్చా అమ్మా...!

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని