నవ్వుల్‌...! నవ్వుల్‌...!

చింటూ.. క్లాస్‌ చెబుతుంటే వినకుండా.. పుస్తకంలో ఏదో రాస్తున్నావేంటి?...

Updated : 27 Sep 2022 04:12 IST

ఆకలిగా ఉందేమో..

టీచర్‌ : చింటూ.. క్లాస్‌ చెబుతుంటే వినకుండా.. పుస్తకంలో ఏదో రాస్తున్నావేంటి?  
చింటు : ఆవు బొమ్మ గీస్తున్నా టీచర్‌..
టీచర్‌ : ఏదీ.. చూపించు?
చింటు : ఆ కాగితాన్ని ఇప్పుడే ఆవు తినేసింది టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

గొప్ప ఆలోచన

అంకుల్‌ : రమ్యా.. ఏంటి చెప్పులు లేకుండా స్కూల్‌కి వెళ్తున్నావు?
రమ్య : మరేం లేదు అంకుల్‌.. భవిష్యత్తు తరాలు నా అడుగు జాడల్లో నడుస్తారని..
అంకుల్‌ : ఆ..!!

అబ్బో.. అలాగా..

టీచర్‌ : పిల్లలూ.. ఎవరికైనా ఎండమావులు అంటే ఏంటో తెలుసా?
రాజు : నాకు తెలుసు టీచర్‌..
టీచర్‌ : వెరీగుడ్‌.. ఏంటో చెప్పు?
రాజు : ఎండలో మేసే ఆవులను ఎండమావులు అంటారు టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

- అమ్మిన వెంకట అమ్మిరాజు, పేరూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని